Back

President Message

Profile

సాయి గొర్రెపాటి

GATA ప్రధాన కార్యదర్శి

మనిషికి మానవత్వం కులం.

మనసుకి ఆత్మీయత బలం.

శుభమస్తు.శ్రీరస్తు . నమస్కారం .తెలుగు వారందరికీ గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) వెబ్సైట్ కు స్వాగతం. తెలుగింటి సాంసకృతిక ,సాంప్రదాయ ,కళా ప్రాధాన్యతలను ఒక దశాబ్దంగా జయప్రదంగా మరియు వైభవోపేతంగా పోషిస్తూ పలు సందర్భాల్లో తమదైన రీతిలో తెలుగు వారిని అక్కునచేర్చుకుని ఆదరిస్తున్న GATA సంస్థకు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

GATA సంస్థ వ్యవస్థాపక సభ్యుడనైన నేను గతంలో వివిధ సంస్థల్లో విభిన్న విశిష్ఠ బాధ్యతలను సమర్థతానుకులంగా నిర్వర్తించాను. కోవిడ్ మహమ్మారి కారణాన అనుభవాలకు భిన్నంగా సాగిన గత ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలకు కొంతవరకు సవాలుగా నిలిచినప్పటికీ, అవసరాలకు తగిన అండగా GATA తరుపున ఎన్నో సహాయ కార్యకలాపాలను సందర్భోచితంగా అందచేసాము.

అందులో భాగంగా మహమ్మారిని ఎదురించి అండగ నిలిచిన ప్రధాన ప్రతిస్పందనాదారులైన పోలీసు మరియు అగ్నిమాపక యోధులకు గాను సహాయ నిధులను అందజేయగలడం మరియు అమెరికాకు సందర్శనార్థమై వచ్చి కరోనా పైశాచికతకు కదలలేక అమెరికాలో చిక్కుకున్న ఇన్సూరెన్స్ లేని తల్లితండ్రులకు 1000 కు పైగా ఔషధ సేవలను అందజేయడం ఎంతో సంతృప్తిని కలుగచేసాయి.. సహాయసహకారాలతో పాటుగా సాహిత్య పరంగా, అంతర్జాల జూమ్ వేదికగా, పలువురు కవోత్తములను గౌరవిస్తూ వారిని విశిష్ఠ తెలుగు భాషా పోషకులుగా అభినందిస్తూ సాహితీ సదస్సును నిర్వహించడం జరిగినది. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సాహంతో నిర్వహించబడు డే అండ్ నైట్ క్రికెట్ , బాడ్మింటన్ మరియు వాలీబాల్ టోర్నమెంట్లను ఈ ఏడాది కూడా నిరాటంకంగా , నిర్వహించాము. చేయీ చేయీ కలిపితే చేయలేనిదంటూ ఏదీ ఉండబోదు. ఆ విధంగా ఇవన్నీ ఇంత విజయవంతంగా జరుగుటకు ఎందరో సహృదయులు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం అభినందనీయం.ఈ సంద్భంగా GATA సంస్థకు అనునిత్యం అద్వితీయ సహకారాన్ని మరియు ప్రోత్సాహాన్ని అందజేస్తున్న సహ వ్యవస్థాకులకు మరియు EC బోర్డుకు నా హృదపూర్వక అభినందన వందన మాలలు.

ఈ సహృదయ సజ్జన సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. రానున్న కాలంలో రాబోవు కష్టసుఖాల్లో తెలుగు ప్రజల ఆదరాభిమనాలు మూటకట్టుకుంటూ అనునిత్యం మా వంతు సహకార సదుపాయాలతో GATA తరుపున ఎల్లవేళలా తోడువుతామని విశ్వసిస్తున్నాను.

అందరి ఆశలు ఆశయాలు అన్నివేళలా నెరవేరాలని కోరుకుంటూ... !

సదా

మీ శ్రేయభిలాషి

సాయి గొర్రెపాటి , GATA ప్రధాన కార్యదర్శి.